Header Ads

ad728
  • Breaking News

    Sri Rama Navami 2020 Wishes: శ్రీరామ నవమి.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పండిలా..

    Sri Rama Navami 2020 Wishes: శ్రీరామ నవమి.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పండిలా..

    కరోనా రక్కసిని పారదోలి.. దేశంలో మళ్లీ పూర్వ పరిస్థితులు రావాలని కోరుకుంటూ శ్రీరాముడిని వేడుకుందాం. ఈ విషెస్‌ను స్నేహితులతో పంచుకుని శుభాకాంక్షలు తెలుపుదాం.

    Sri Rama Navami 2020 Wishes: శ్రీరామ నవమి.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పండిలా..
    Sri Rama Navami 2020 Wishes: శ్రీరామ నవమి.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక...

    శ్రీరాముడి జన్మదినమైన ఛైత్రశుద్ధ నవమిని హిందువులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. ఏటా ఊరూరా నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి, పానకం, వడపప్పు పంచిపెడతారు. అయితే, ఈ సారి లాక్‌డౌన్ వల్ల సీతారాముల కళ్యాణం కూడా జరిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పవిత్రమైనా శ్రీరామ నామం జపిస్తూ.. ఇంట్లోనే పూజలు చేయడం ఉత్తమం.

    శ్రీరామ నామం ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి. కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని అంటారు. శ్రీరామ నవమి నేపథ్యంలో ఈ కింది విషెస్‌తో మీ బంధుమిత్రులకు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా శుభాకాంక్షులు తెలపండి.


    Sri Rama Navami 2020 Wishes: శ్రీరామ నవమి.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పండిలా..
    శ్రీరామ నవమి శుభాకాంక్షలు
    శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’ అందరికి నవమి శుభాకాంక్షలు

    శ్రీ రామ జయరామ జయ జయ రామ!
    ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
    లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
    అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

    Also Read: శంబళ నగరం మిస్టరీ.. కల్కీ పుట్టిన ఆ రహస్య ప్రాంతంపై హిట్లర్ కన్ను, చివరికి ఏం జరిగిందంటే..

    నిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
    కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
    ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
    ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
    మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...
    ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
    ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
    పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ’ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

    Also Read: హనుమంతుడి రియల్ ఫొటో.. ఇది క్లిక్ చేసిన వ్యక్తి ఎలా చనిపోయాడు? మిస్టరీ వీడిందిలా!

    క తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
    ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
    ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
    ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
    ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
    ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
    ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
    ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
    మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
    అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
    అదే రామాయణం’.
    అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

    ట్టాభిరామునికి ప్రియవందనం
    పాప విదూరునికి జయవందనం
    అయోధ్య రామునికి అభివందనం
    అందాల దేవునికి మదే మందిరం
    శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
    అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

    Source: https://telugu.samayam.com/viral-adda/trending/happy-sri-rama-navami-quotes-sms-greetings-whatsapp-facebook-status-messages-in-telugu/articleshow/74935202.cms

    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728